మరో ఐదేళ్లలో వారణాసి ప్రపంచస్థాయి నగరంగా మారబోతోంది: అమిత్ షా

  • వారణాసి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు
  • ఈ ఐదేళల్లో వారణాసి ఎంతో అభివృద్ధి చెందింది
  • యూపీ అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది
బీజేపీ కార్యకర్తల శ్రమతోనే ఈ విజయం సాధ్యమైందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొనియాడారు. వారణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, వారణాసి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ ఐదేళల్లో వారణాసి ఎంతో అభివృద్ధి చెందిందని, మరో ఐదేళ్లలో వారణాసి ప్రపంచస్థాయి నగరంగా మారబోతోందని అన్నారు. యూపీ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని అన్నారు. 
Go Back to Shorts
Uttar Pradesh
Varanasi
bjp
amith shah
modi

More Telugu News